చిన్ని చిన్ని పాపలు చిన్నారి పాపలు
ముద్దు మీ మోముల నిండాలి కాంతులు !
ముద్దు మీ మోముల నిండాలి కాంతులు !
క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!!
కల్లాకపటం లేని ఈ చిన్ని మనసులే
మోసం ద్వెషం లేని నవ సమాజ శిల్పులు
జీవన చైతన్యపు సౌదానికి పునాడులు
చిట్టి చిట్టి అడుగుల బుడి బుడి ఈ నడకలే
కులమతాల పేరు లేని నవ్య కాంతి రేఖలు
క్రొంగొత్త లోకాలకు బాటలేయు దారులు!
పసితనపు పరిమలాల విరబూయు నవ్వు పూలు
నిలుపుతాయి నేరాలు జయిస్తాయి వేదనలు
పెంచుటాయి మమతలు కలుపుతాయి మనసులు !
మేఘాలే కురుస్తాయి ఆనంద వర్షాలు
ప్రేమ సెలయేరులే త్రొక్కుతాయి పరవళ్ళు
క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు
ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!
Naagaraja T చెప్పారు
అక్టోబర్ 15, 2006 వద్ద 7:36 పూర్వాహ్నం
తెలుగు బ్లాగ్ప్రపంచానికి స్వాగతం.