కూనలమ్మ పదాలు …

లేని నిన్నటి కన్న
రాని రేపటి కన్న
ఉన్న నేడే మిన్న
ఓ కూనలమ్మ!

ఒకటి ఒకటీ రెండు
పూలు కలిపితె చెండు
కలసి మెలగుటె మెండు
ఓ కూనలమ్మ!

మంచి మమతల మనసు
ఎపుడు వాడని సొగసు
స్థిరము కాదీ వయసు
ఓ కూనలమ్మ!

శాంతి సహనము లొలికి
ప్రేమ సుధలను చిలికి
మధుర మగునే మనికి
ఓ కూనలమ్మ!

చేయి చేయీ కలుపు
కృషిని వీడక సలుపు
తుదకు నీదే గెలుపు
ఓ కూనలమ్మ!

This entry was posted in నా రాతలు. Bookmark the permalink.

One Response to కూనలమ్మ పదాలు …

  1. ravichandrae says:

    చాల సక్కటి మాటలు
    ముత్యాల మూటలు
    అందుకో వందనాలు
    ఓ కూనలమ్మ :-)

    మీ కవితలు చదివాక నాకు కూడా ఓ పదం రాయాలనిపించింది. అదే నా మొదటి కూనలమ్మ పదం.
    ఏవైనా తప్పులుంటే సర్దుకోండి.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )