ఎన్నాళ్ళో ఈ శిశిరము
కళాహీనమాయె వనము
ఎన్నాళ్ళో ఈ శిశిరము
రాగ హీనమాయె మనము ..
కళాహీనమాయె వనము
ఎన్నాళ్ళో ఈ శిశిరము
రాగ హీనమాయె మనము ..
ఆకు ఆకు నేల రాలి
ధూళి కలిసి పోయేనో
రెమ్మ రెమ్మ చిగురు లేక
నీరసించి వాడేనో
కొమ్మ కొమ్మ మోడువారి
అలసి కలయజూచేనో .. ఎన్నాళ్ళో…
నీ వెచ్చని స్పర్శ లేక
చలికి వణికి వణికి సోలి
రాగ జీవ ధార లేక
నీరసించి సొమ్మసిల్లి
వేచితినో వనమాలీ
నీ రాకయె చైత్రమనుచు
వేడుచుంటి బ్రతిమాలీ
నన్ను బ్రోవ రమ్మనుచు .. ఎన్నాళ్ళో…
radhika చెప్పారు
నవంబరు 2, 2006 వద్ద 7:53 అపరాహ్నం
chaalaa baagundandi mee edurucuupu. ennaalloa sisiram antuu modalu pettina vidham,nee sparsa leka antuu konasaagimcadam caalaa baagunnadi.
Sudheer Kothuri చెప్పారు
నవంబరు 4, 2006 వద్ద 3:42 అపరాహ్నం
chala baagundi
మానస వీణ చెప్పారు
నవంబరు 8, 2006 వద్ద 10:01 పూర్వాహ్నం
@radhika, sudheer
mee prOtsaahaaniki dhanyavaadaalu.