తన సిరిని నేనంట
విరి నవ్వు నాదంట
వెన్న లాంటి మనసు వాడు
యెన్నెలంటి చూపు వాడు
నా సామిని తలచుకుంటె
నా ఎడద తో పాటె
ఎసరు కూడ పొంగింది
యేడి యేడి బువ్వొండి
తన చేతిలో చెయ్యేసి
ముద్ద ముద్ద చేసి పెట్టి
చివరి ముద్ద నాదంటూ
కొసరి కొసరి తినిపించి
కొంగు తోన మూతి తుడిచి
నా వెన్నెల ఈడేనంటూ
నా సామి ఒళ్ళోన
హాయిగా తలను పెట్టి
తన వేళ్ళు నా తలను
వెచ్చగా నిమురుతుంటె
కళ్ళలోన కళ్ళు పెట్టి
చూపు లోన చూపు కలిపి
కబురులేవి చెప్పలేని
ఊసులన్ని ఆడేసి
చల్లగా నిదరోతా
తన ప్రేమకు నే మురిసి !!
విరి నవ్వు నాదంట
వెన్న లాంటి మనసు వాడు
యెన్నెలంటి చూపు వాడు
నా సామిని తలచుకుంటె
నా ఎడద తో పాటె
ఎసరు కూడ పొంగింది
యేడి యేడి బువ్వొండి
తన చేతిలో చెయ్యేసి
ముద్ద ముద్ద చేసి పెట్టి
చివరి ముద్ద నాదంటూ
కొసరి కొసరి తినిపించి
కొంగు తోన మూతి తుడిచి
నా వెన్నెల ఈడేనంటూ
నా సామి ఒళ్ళోన
హాయిగా తలను పెట్టి
తన వేళ్ళు నా తలను
వెచ్చగా నిమురుతుంటె
కళ్ళలోన కళ్ళు పెట్టి
చూపు లోన చూపు కలిపి
కబురులేవి చెప్పలేని
ఊసులన్ని ఆడేసి
చల్లగా నిదరోతా
తన ప్రేమకు నే మురిసి !!
Sapthagiri చెప్పారు
నవంబరు 14, 2006 వద్ద 7:05 అపరాహ్నం
నిజంగానె వీణ పలికినట్టు వుంది
Naresh చెప్పారు
డిసెంబరు 5, 2006 వద్ద 2:19 అపరాహ్నం
Hats off
relationship b/w husband and wife should be like that
swathi చెప్పారు
ఫిబ్రవరి 3, 2007 వద్ద 9:13 పూర్వాహ్నం
yanki paata laane undi..
intaki mee gurinchi oka introduction page blog lo pedite baguntundi.
మానసవీణ చెప్పారు
మార్చి 15, 2007 వద్ద 10:45 పూర్వాహ్నం
నేను కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నా స్వాతి గారు, about me page raayalani… but that is tough task. will do sometime.