శిలగానె మిగిలావ దేవా…
ప్రేమ దీపము లేక
శాంతి గంధము లేక
అంతర్వివేచనల
నిత్యార్చనలు లేక
శిధిలమైనట్టి ఈ
హృదయాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…
నా వినతులాలించి
నీ కరుణ సారించి
ప్రాణమ్మునే మరల తేవా …
డిసెంబరు 26, 2006 వద్ద 1:46 అపరాహ్నం (నా రాతలు)
ప్రేమ దీపము లేక
శాంతి గంధము లేక
అంతర్వివేచనల
నిత్యార్చనలు లేక
శిధిలమైనట్టి ఈ
హృదయాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…
నా వినతులాలించి
నీ కరుణ సారించి
ప్రాణమ్మునే మరల తేవా …
డిసెంబరు 21, 2006 వద్ద 9:28 పూర్వాహ్నం (నచ్చిన కవితలు)
చెట్టుని నరికేశారు
భోరుమంది
నీడ లేకుండా పోయానని
ఆ కన్నీరుకి
వేర్లు తడిశాయి
మొక్కలు మొలిచాయి
మళ్ళీ గొడ్డలి సిధ్ధం …
~~~
ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానినొకటి చూసుకోవు.
ఎప్పుడు కలిసే ఉండే పెదాలు
ఒక్క మాటలో విడిపోతాయి.
అందుకే ..
కళ్ళకి ధ్యానం కావాలి
పెదాలకి మౌనం కావాలి ..
డిసెంబరు 16, 2006 వద్ద 7:37 పూర్వాహ్నం (నచ్చిన కవితలు, నా రాతలు)