ఫిబ్రవరి 18, 2007 వద్ద 4:41 అపరాహ్నం (నా రాతలు)
(బ్రతుకు తెరువు కోసం భార్యని పల్లెలో విడిచి పట్నానికొచ్చిన ఒక రోజు కూలీ మనసు …)
ఆకలేసినాదంటే బువ్వకోసమెతికేను
నీళ్ళు నిండుగా తాగి పొట్ట నింపుకున్నాను
నిద్దరొచ్చినాదంటే గూడు గుర్తుకొచ్చేను
ఏ నీడలోనైనా నే కునుకు తీసేను
కానీ,
గుండెల్లొ ఏ మూలో గుబులేసినాదంటె
వేదనంత వెల్లువలా నను ముంచినాదంటె
నీ నవ్వు నీ చూపు కళ్ళ ముందు కదిలేను
ఊసులెన్నొ గుర్తుకొచ్చి ఊయలూపి పోయేను
నవ్వుకో ఏడుపుకో కంట తడి నిండేను
నీ తోడు లేకుండా ఒంటిగానే మిగిలేను ….
ఒంటిగా … నే మిగిలేను …
1 వ్యాఖ్య
ఫిబ్రవరి 2, 2007 వద్ద 10:15 అపరాహ్నం (నచ్చిన కవితలు, నా రాతలు)
స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె
స్వేఛ్చ కావలె ఈ విపంచికి
సంకుచిత భావాల చెరవిడి
సమసమత్వపు నింగికెగరగ …
అహము భారము అంతరించగ
తేలి రయ్యన ఎగిరిపోగా
అంతరంగము అందమరయగ
తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి!
తొలి ఉషస్సుల సందె వెలుగుల
తనదు గానము ఆలపించగ
రాజబాటల ముళ్ళదారుల
తన విహారముననుభవించగ… స్వేఛ్చ కావలె ఈ విపంచికి!
అభిప్రాయములు