స్వేఛ్చ కావలె …

స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె
స్వేఛ్చ కావలె ఈ విపంచికి
సంకుచిత భావాల చెరవిడి
సమసమత్వపు నింగికెగరగ …

అహము భారము అంతరించగ
తేలి రయ్యన ఎగిరిపోగా
అంతరంగము అందమరయగ
తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

తొలి ఉషస్సుల సందె వెలుగుల
తనదు గానము ఆలపించగ
రాజబాటల ముళ్ళదారుల
తన విహారముననుభవించగ… స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

అభిప్రాయములు

  1. radhika చెప్పారు

    ఫిబ్రవరి 2, 2007 వద్ద 11:36 అపరాహ్నం

    caalaa baagundandi.civari remdu khandikalu ayite caalaa caalaa nachaayi.

  2. విహారి చెప్పారు

    ఫిబ్రవరి 3, 2007 వద్ద 4:13 పూర్వాహ్నం

    కమనీయంగా వుంది

    విహారి
    http://vihaari.blogspot.com


వ్యాఖ్య ను ఉంచండి