(బ్రతుకు తెరువు కోసం భార్యని పల్లెలో విడిచి పట్నానికొచ్చిన ఒక రోజు కూలీ మనసు …)
ఆకలేసినాదంటే బువ్వకోసమెతికేను
నీళ్ళు నిండుగా తాగి పొట్ట నింపుకున్నాను
నిద్దరొచ్చినాదంటే గూడు గుర్తుకొచ్చేను
ఏ నీడలోనైనా నే కునుకు తీసేను
కానీ,
గుండెల్లొ ఏ మూలో గుబులేసినాదంటె
వేదనంత వెల్లువలా నను ముంచినాదంటె
నీ నవ్వు నీ చూపు కళ్ళ ముందు కదిలేను
ఊసులెన్నొ గుర్తుకొచ్చి ఊయలూపి పోయేను
నవ్వుకో ఏడుపుకో కంట తడి నిండేను
నీ తోడు లేకుండా ఒంటిగానే మిగిలేను ….
ఒంటిగా … నే మిగిలేను …
radhika చెప్పారు
ఫిబ్రవరి 18, 2007 వద్ద 8:49 అపరాహ్నం
చాలా బాగుంది.ముగింపు చాలా బాగుంది.