మొన్నటి దాకా
మోడువారి ఉన్న చెట్లను
చిగురు చైతన్యం వరించింది
పచ్చదనం వెల్లివిరిసింది
మోడువారి ఉన్న చెట్లను
చిగురు చైతన్యం వరించింది
పచ్చదనం వెల్లివిరిసింది
నిన్నటి వరకు
ఎండలతో మండిన ఉద్యాన నగరిలో
తొలకరి జల్లు కురిసింది
పుడమి పులకరించింది
మరల మాటుకు నెట్టివేయబడిన
మనసులు రేపైనా స్పందించవా ?
మానవత్వం పరిమళించదా ?