పుస్తక ప్రియులకు శుభవార్త!

ప్రపంచంలోని అన్ని పుస్తకాలు ఉండే గ్రంధాలయం ఉందనుకోండి… అది కూడా అందరికీ, ఉచితంగా అందుబాటులో ఉండేలా, మీరు చదివిన/చదవాలనుకుంటున్న పుస్తకాల మీద ప్రపంచం నలుమూలల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటే … ఎలా ఉంటుంది??? అద్భుతంగా ఉంటుంది కదా!! అవును, ఈ అద్భుతమైన కలని నిజం చెయ్యాలనే ఆశతో, ఆశయం తో మొదలయ్యింది openlibrary.
Project Gutenberg, Google books project ఇప్పటికే ఉన్నాయి కదా, దీన్లో ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నరా? చాలా  ప్రత్యేకతలున్నాయి, ఉచితంగా ఉంచగలిగే పుస్తకాలన్నిటిని ఒకే చోట ఉంచటం ఒకటైతే, విజ్ఞానసర్వస్వం వికీపీడియ లాగ, మనకి తెలిసిన పుస్తకాల గురించి అందరితో పంచుకునే అవకాశం, ఉన్న పుస్తకాల్లో గాని, సమాచారం లొ గాని తప్పుల్ని మనమే సరిచేసే  వీలు కలిగిస్తోంది openlibrary. ఇదేమీ వాణిజ్యపరమైనది కాదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. నిజంగా  సార్ధకనామధేయం  కదూ?  
 

నేను సైతం అని మీరు కూడా ఒక అడుగు ముందుకేసి పుస్తక సేకరణలో, పుస్తకాల వివరాల సేకరణలో openlibrary కి తోద్పడదామనుకుంటున్నారా? ఈ గుంపులో చేరండి.