శ్వాస తెలిసే నిశ్శబ్దంలో
వెలుగే దూరని చీకటి గదిలో
లోలోపలి వెలుగుల కోసం
వెతుకుతున్న ఈ నా మదిలో
ఒక శాంతి కిరణం ఉదయించింది
ఒక కాంతి పుంజం నర్తించింది
ఆహా, ధన్యం నా ధ్యానం!
ఇదంతా ఒకే ఒక్క క్షణం!
మరుక్షణం అలోచనల అలలు,
మళ్ళీ వెదుకులాటలో నేను!
అంతరావలోకనం
మార్చి 19, 2008 వద్ద 11:09 పూర్వాహ్నం (నా రాతలు)