శ్వాస తెలిసే నిశ్శబ్దంలో
వెలుగే దూరని చీకటి గదిలో
లోలోపలి వెలుగుల కోసం
వెతుకుతున్న ఈ నా మదిలో
ఒక శాంతి కిరణం ఉదయించింది
ఒక కాంతి పుంజం నర్తించింది
ఆహా, ధన్యం నా ధ్యానం!
ఇదంతా ఒకే ఒక్క క్షణం!
మరుక్షణం అలోచనల అలలు,
మళ్ళీ వెదుకులాటలో నేను!
శ్వాస తెలిసే నిశ్శబ్దంలో
వెలుగే దూరని చీకటి గదిలో
లోలోపలి వెలుగుల కోసం
వెతుకుతున్న ఈ నా మదిలో
ఒక శాంతి కిరణం ఉదయించింది
ఒక కాంతి పుంజం నర్తించింది
ఆహా, ధన్యం నా ధ్యానం!
ఇదంతా ఒకే ఒక్క క్షణం!
మరుక్షణం అలోచనల అలలు,
మళ్ళీ వెదుకులాటలో నేను!
మీ బ్లాగు కొత్తరూపు చాలా చాలా బాగుందండి.కవిత మొదటి సగం చదివినప్పుడు ఏదో మామూలు కవితలా అనిపించింది.చదవడం మానేసి వెళ్ళిపోయాను.ఈ రోజు మళ్ళా వచ్చి పూర్తిగా చదివాను.ఇప్పుడే తెలిసింది కవితలోని లోతు.ఎంతన్నా మీరు మీరే.
బావుందండీ ..