ఎక్కడికో ఈ పరుగు
ఎందుకో తెలియదు,
నీ పిలుపు వినిపించుకోకుండా…
నాకు తెలుస్తూనే ఉంది,
నువ్వు పిలుస్తున్నావని.
ఒక్క క్షణం ఆగి చూస్తాను
కాని మనసంతా పరుగు మీదనే,
మళ్ళీ నాకు తెలియకుండానే పరుగు మొదలవుతుంది
ఇప్పుడు ఇలా నీ నుంచి పరుగెత్తినా
ఎప్పటికైనా మరలా నిన్ను కలవాలని వెనుదిరిగి చూస్తాను
అప్పటికి ఈ పరుగు నన్ను ఎంత దూరం చేరుస్తుందో…
నువ్వు కనుచూపు మేరలో కనిపిస్తావో లేదో…
aparichithudu చెప్పారు
ఫిబ్రవరి 15, 2009 వద్ద 1:51 పూర్వాహ్నం
asalu emayindhi, chala rojulu nunchi update cheyatledhhu?
Malakpet Rowdy చెప్పారు
ఫిబ్రవరి 15, 2009 వద్ద 5:18 పూర్వాహ్నం
Good One!
కొత్తపాళీ చెప్పారు
ఏప్రియల్ 9, 2009 వద్ద 8:52 అపరాహ్నం
బాగా రాస్తున్నారు.
దయచేసి కొనసాగించండి.
నెటిజన్ చెప్పారు
ఏప్రియల్ 9, 2009 వద్ద 10:27 అపరాహ్నం
బాగుంది.