పదాలకు చిక్కని అద్భుతమైన భావనేమో భగవంతుడంటే. వర్ణింపశక్యం కానిదైనా, పంచుతూపోతే అలౌకికానందాన్ని పెంచే అందం ఆ “భావన”కి ఉండబట్టేనేమో చాలా మంది కళాకారులు తమ తమ కళలలో దానిని వ్యక్తం చేయటానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. సకల గుణ సమ్మిళితమైన ఆ ఆనందార్ణవంలో ఏ కొన్ని తరంగాలకో స్పందించి తమ శక్త్యానుసారం సన్నుతించగలిగారు. సర్వ వర్ణ సంశోభితమైన ఆ నిర్వర్ణాన్ని తమకు నచ్చిన రంగుల్లో చిత్రించగలిగారు, సకల శబ్ద మాధుర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్న నిశ్శబ్దారామంలో భావకుసుమాలనల్లి గీతాంజలులర్పించారు, పాడారు, ఆడారు. చివరికి ఏ విధంగా వ్యక్తీకరించాలో తెలియనివాళ్ళు ఆ సంతోష సాగరాన్ని తమలోనే దాచుకోలేక ఏ బంధమూ లేని ఆ అనురాగ సింధువును తమకు ప్రియాతిప్రియమైన నేస్తం లాగ, తమ చుట్టూ తిరిగే చిన్నితండ్రి లాగ, మనోహరుడైన ప్రేమమూర్తి లాగ, చల్లగా లాలించే అమ్మ లాగ, చక్కగా పాలించే తండ్రి లాగ, జీవనసారధి అయిన సద్గురువులాగ భావించుకుని ఆ ప్రేమామృత ఝరికి తమదైన రూపాన్ని కల్పించుకున్నారు. ఎందరో ఎందరెందరో మహానుభావులు ఆ మహానుభవంలో ఆసాంతం కరిగిపోయారు, కలిసిపోయారు! నా మేధకి, ఊహకి, జ్నప్తికి అందగలిగిన అన్నింటిలోను నిండిపోయిన “ఆ భావన” నన్ను మాత్రం వేరుగా ఉంచింది ఆ అవ్యక్తానుభవాన్ని ఆస్వాదింపచేయడానికేనేమో.
-
ఎవరేమన్నారు
- jagadish on భక్తి…
- radha on ఎక్కడికో ఈ పరుగు …
- raji on అతడెవరో ..
- ramakrishna on మార్పు … నా లోనూ!
- ravichandrae on కూనలమ్మ పదాలు …
Very nice. I would like to hear something about SADGURU, if u can pls. thank u.