నివేదన

నీ కోసం తెచ్చిన
పూల హారం వాడిపోయింది
తోవ లోనే పళ్ళు దొర్లిపోయినాయి
వీణ పగిలిపోయింది
నిన్ను పిలిచే నా కంఠ స్వరం
నా చెవులకే వినిపించడం మానింది

ఎన్ని పగళ్ళు రాత్రులు నడిచినా
ఎడతెగని అడవి
దూరాన మసకలో కనపడీ
కనపడని కోట బురుజులు
ఎంతకీ చేరువ కాని సౌధదుర్గాలు..
నాకిక తోవ లేదు
తలుపులు మూసేసారు
వెనక్కి వెళ్ళినా, ఇక్కడే
తిరిగి తిరిగి నశించినా
ఆనాడు రమ్మన్న నీ మధుర స్వరం నన్ను విడువదు

నీలో తప్ప నాకు లోకంలో చోటు లేదు
నీ ఆలింగనంలో తప్ప నాకు శాంతి లేదు
దూరంగా ఆకాశంలో ఉండుండి మెరిసే
నీ ఆకాశ దీపమొక్కటే గుర్తు
ఈ చీకట్లో గాలిలో నిముషం వినిపించే
నీ వీణరవమే పిలుపు
నువ్వే గతి!
నాకిక శక్తి!

    ~~~

రాసిందెవరో తెలియకపోయి ఉంటే, రవీంద్రుని కవితకి తెలుగు అనువాదమని అనుకుని ఉండేదాన్ని. కాని, ఈ నివేదన గీతాంజలిని తెనిగించిన చలం మదిలోనుంచి జాలువారినది!

ప్రకటనలు
This entry was posted in నచ్చిన కవితలు, భక్తి. Bookmark the permalink.

3 Responses to నివేదన

 1. radhika అంటున్నారు:

  నేనూ గీతాంజలి అనే అనుకుంటున్నాను.కాని ఇది చదువుతున్నంత సేపూ నాకు అన్నమయ్య సినిమాలో అదివో అల్లదివో అన్న పాట చిత్రీకరణ గుర్తొచ్చింది.బహుసా రాఘవేంద్రుడికి ఇదే ఇన్స్పిరేషన్ కావచ్చు.

 2. మానస వీణ అంటున్నారు:

  “అదివో అల్లదిగో” పాటకి, ఈ నివేదనకి సంబంధం అర్ధం కాలేదు, పాట చిత్రీకరణ గుర్తుకు తెచ్చుకునేంతవరకు. సరిగ్గా చెప్పారు.

 3. జాలయ్య అంటున్నారు:

  మీ బ్లాగును జల్లెడలో కలపడం జరిగినది.

  http://jalleda.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s