Category Archives: నచ్చిన కవితలు

నా నానీలు

చెంపలు జారినవి రెండు చుక్కలే. మనసు లోపల ఎన్ని ముక్కలో! ~~~ బరువుల్ని తల’లో’కెత్తుకుంటే, చాలా రుసుములు చెల్లించాల్సొస్తుంది. ~~~ నాకంతా నువ్వే అన్నాను… నీ కళ్ళలో నిండుగా నేను… ~~~ అనుభవం దారి చూపిస్తే చాలు. వేలు పట్టుకుని నడిపించక్కర్లేదు! ~~~ పొంగినా, పొరలినా జారినా, జాలువారినా మారేది రూపమే! స్వరూపం కాదు. ~~~ … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, నా రాతలు | 2 వ్యాఖ్యలు

ఎక్కడికో ఈ పరుగు …

ఎక్కడికో ఈ పరుగు ఎందుకో తెలియదు, నీ పిలుపు వినిపించుకోకుండా… నాకు తెలుస్తూనే ఉంది, నువ్వు పిలుస్తున్నావని. ఒక్క క్షణం ఆగి చూస్తాను కాని మనసంతా పరుగు మీదనే, మళ్ళీ నాకు తెలియకుండానే పరుగు మొదలవుతుంది ఇప్పుడు ఇలా నీ నుంచి పరుగెత్తినా ఎప్పటికైనా మరలా నిన్ను కలవాలని వెనుదిరిగి చూస్తాను అప్పటికి ఈ పరుగు … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు | 5 వ్యాఖ్యలు

నివేదన

నీ కోసం తెచ్చిన పూల హారం వాడిపోయింది తోవ లోనే పళ్ళు దొర్లిపోయినాయి వీణ పగిలిపోయింది నిన్ను పిలిచే నా కంఠ స్వరం నా చెవులకే వినిపించడం మానింది ఎన్ని పగళ్ళు రాత్రులు నడిచినా ఎడతెగని అడవి దూరాన మసకలో కనపడీ కనపడని కోట బురుజులు ఎంతకీ చేరువ కాని సౌధదుర్గాలు.. నాకిక తోవ లేదు … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, భక్తి | 3 వ్యాఖ్యలు

స్వేఛ్చ కావలె …

స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె ఈ విపంచికి సంకుచిత భావాల చెరవిడి సమసమత్వపు నింగికెగరగ … అహము భారము అంతరించగ తేలి రయ్యన ఎగిరిపోగా అంతరంగము అందమరయగ తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి! తొలి ఉషస్సుల సందె వెలుగుల తనదు గానము ఆలపించగ రాజబాటల ముళ్ళదారుల తన … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు, నా రాతలు | 2 వ్యాఖ్యలు

వెన్నముద్దలు

జనార్ధన్ మహర్షి గారి “వెన్నముద్దలు” నుంచి మచ్చుక్కి రెండు .. చెట్టుని నరికేశారు భోరుమంది నీడ లేకుండా పోయానని ఆ కన్నీరుకి వేర్లు తడిశాయి మొక్కలు మొలిచాయి మళ్ళీ గొడ్డలి సిధ్ధం … ~~~ ఒకటే చూసే రెండు కళ్ళు ఒకదానినొకటి చూసుకోవు. ఎప్పుడు కలిసే ఉండే పెదాలు ఒక్క మాటలో విడిపోతాయి. అందుకే .. … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు | 3 వ్యాఖ్యలు

వెదురుగా పుట్టాక …

వెదురుగా పుట్టాక వేణువయ్యేదాక ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ? ఏ వేలి మృదుకొనలొ నిను బ్రోచు ఆ వేళ నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న వేసారి అలపుతో వగచి వాడే కన్న నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ వేడి గాలులనన్ని వెత … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు, నా రాతలు | 5 వ్యాఖ్యలు

నేనే ఎంకినైతే ..

తన సిరిని నేనంట విరి నవ్వు నాదంట వెన్న లాంటి మనసు వాడు యెన్నెలంటి చూపు వాడు నా సామిని తలచుకుంటె నా ఎడద తో పాటె ఎసరు కూడ పొంగింది యేడి యేడి బువ్వొండి తన చేతిలో చెయ్యేసి ముద్ద ముద్ద చేసి పెట్టి చివరి ముద్ద నాదంటూ కొసరి కొసరి తినిపించి కొంగు … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 5 వ్యాఖ్యలు