Category Archives: నా రాతలు

ఎటు చూడను, నా నేస్తం?

నువ్వు మూగవయ్యాక నాకు పాట ఎక్కడిది? నీ స్నేహం జారాక నాకు శాంతి ఎక్కడిది ? ఏవేవో అలజడులు దిశ తెలియని పెనుగాలులు నమ్మకాన్ని తుడిచేస్తే ప్రేమ దివ్వెనార్పేస్తే నువ్వు కనుమరుగైపోతే నాకు నేనే కరువైతే నీళ్ళు ఎండిన కనుదోయితో నేనెటు చూడను, నా నేస్తం? నీకై… చాచి ఉంచిన ఈ చేత్తో ఇంక … ఏమి చెయ్యగలను, … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 2 వ్యాఖ్యలు

కాలానుభుతూలకు అతీతంగా …

రోడ్డు రోలరు తొక్కుకుంటూ పోయింది రాళ్ళని తనలోకి నొక్కేస్తూ, కుక్కేస్తూ ఒక్క పిసరైనా ఖాళీ లేకుండా.. తళతళలాడే తారు రోడ్డైపోయింది తను మీద వెళ్ళే వాళ్ళ వేగానికి తన ఎగుడుదిగుళ్ళు అడ్డు రాకుండా … ఇప్పుడే అడుగులేస్తున్నచిట్టి పాపలో జల్లుకి తలలెత్తే గడ్డి పువ్వులో తన దగ్గరకి వచ్చే ఊసే లేదిక … చక్రాల దొర్లుడే … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు | Tagged , , | 1 వ్యాఖ్య

నా చిట్టి వర్ష

కలువల్ల కన్నుల్ల పాపాయి ఎవరు? నా చిట్టి వర్ష … తేనెల్ల పలుకుల్ల చిన్నారి ఎవరు ? నా చిన్ని వర్ష … మబ్బుల్ల బుగ్గల్ల అమ్మాయి ఎవరు? నా బుల్లి వర్ష … వెన్నెల్ల నవ్వుల్ల బుజ్జాయి ఎవరు? నా బుజ్జి వర్ష …

Posted in చిట్టి-పాటలు, నా రాతలు, పిల్లలు | 1 వ్యాఖ్య

నా నానీలు

చెంపలు జారినవి రెండు చుక్కలే. మనసు లోపల ఎన్ని ముక్కలో! ~~~ బరువుల్ని తల’లో’కెత్తుకుంటే, చాలా రుసుములు చెల్లించాల్సొస్తుంది. ~~~ నాకంతా నువ్వే అన్నాను… నీ కళ్ళలో నిండుగా నేను… ~~~ అనుభవం దారి చూపిస్తే చాలు. వేలు పట్టుకుని నడిపించక్కర్లేదు! ~~~ పొంగినా, పొరలినా జారినా, జాలువారినా మారేది రూపమే! స్వరూపం కాదు. ~~~ … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, నా రాతలు | 2 వ్యాఖ్యలు

తేడా ఎక్కడ?

అవే చెట్లు …  నా లోని సంతోషానికి  తలలూపుతున్నట్లు …    అదే ఊపు …  నా లోని సంఘర్షణలకి  అద్దం  పడుతున్నట్లు  … 

Posted in నా రాతలు | వ్యాఖ్యానించండి

ప్రభు నువ్వే నువ్వే

అంతటా అన్నిటా ప్రభు నువ్వే నువ్వే అణువూ అణువువై నువ్వే విడివడి భిన్న రూపాలలో మళ్లీ కలిసి సుందర జగమే రంగస్థలిగా ॥ అంతటా ॥ సంద్రం నుంచి ఎగసే కెరటమై ఉరిమే మేఘమై కురిసే వర్షమై నదులూ చెరువులూ జలపాతాలుగా ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥ మట్టిలో రేణువై … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, భక్తి | 1 వ్యాఖ్య

నేనూ ఎదుగుతా!

వాళ్ళకి నచ్చినంత ఎత్తుకే  ఎదగాలి వాళ్ళకి నచ్చిన ఆకృతిలో ఒదగాలి ముదిరిన మొదళ్ళని దాచుకుంటూ లేతగానే కనిపించాలి,మురిపించాలి …దేన్నీ స్వేచ్ఛగా ఎదగనివ్వరా?

Posted in నా రాతలు | వ్యాఖ్యానించండి