Category Archives: నువ్వు-నేను

ఎటు చూడను, నా నేస్తం?

నువ్వు మూగవయ్యాక నాకు పాట ఎక్కడిది? నీ స్నేహం జారాక నాకు శాంతి ఎక్కడిది ? ఏవేవో అలజడులు దిశ తెలియని పెనుగాలులు నమ్మకాన్ని తుడిచేస్తే ప్రేమ దివ్వెనార్పేస్తే నువ్వు కనుమరుగైపోతే నాకు నేనే కరువైతే నీళ్ళు ఎండిన కనుదోయితో నేనెటు చూడను, నా నేస్తం? నీకై… చాచి ఉంచిన ఈ చేత్తో ఇంక … ఏమి చెయ్యగలను, … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 2 వ్యాఖ్యలు

ఒక్కసారి నేస్తం…

ఒక్క సారి చూడు చెలిమి నిండిన కళ్ళతో … ఈ శిలను చైతన్యం వరిస్తుంది మనసారా ఒక్క సారి నవ్వు నేస్తం … నలుదెసల నడుమ నా హృదయం నర్తిస్తుంది

Posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 3 వ్యాఖ్యలు

అతడెవరో ..

మెలమెల్లగ నను తాకి సాగేటి చిరుగాలికి తెలిసిందో ఏమో నా మాటా.. చలచల్లని తెమ్మరకు తలలూపే తరులన్నీ పాడాయి నా లోని పాటా.. నలనల్లని రాతిరిలో నవ్వేటి చుక్కలకూ ఆ పాట వినిపించిందంటా.. ఆ తారలు ఈ తరువులు నను చుట్టిన తెమ్మెరలు చెప్పమన్నాయి ఈ చిన్ని మాటా నీ ఊసుల ఊయలలో అతడెవరో అతడెవరో … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, నువ్వు-నేను | 3 వ్యాఖ్యలు

నేనే ఎంకినైతే ..

తన సిరిని నేనంట విరి నవ్వు నాదంట వెన్న లాంటి మనసు వాడు యెన్నెలంటి చూపు వాడు నా సామిని తలచుకుంటె నా ఎడద తో పాటె ఎసరు కూడ పొంగింది యేడి యేడి బువ్వొండి తన చేతిలో చెయ్యేసి ముద్ద ముద్ద చేసి పెట్టి చివరి ముద్ద నాదంటూ కొసరి కొసరి తినిపించి కొంగు … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 5 వ్యాఖ్యలు

నీ స్నేహ మాధురిలో

నీ స్నేహ మాధురిలో ఝరిలో                    తనిచి తడిసి నేను.. నీ నవ్వుల వెన్నెలలో అలలో                    విరిసి మురిసి నేను.. నీ మనసు ముంగిలిలో చలిలో                    నిలిచి వేచి నేనూ…

Posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం | 2 వ్యాఖ్యలు