Category Archives: పిల్లలు

వాన పడుతోంది

వాన పడుతోంది మనం ఏం చేద్దాం? వాన పడుతోంది మనం ఏం చేద్దాం? చిటపట చిటపట చినుకులతో చిందులేద్దాం మనం చిందులేద్దాం చిట్టి పొట్టి గొడుగులలో గెంతులేద్దాం మనం గెంతులేద్దాం జలజల పారే నీళ్ళల్లో పడవలేద్దాం మనం పడవలేద్దాం మిలమిల మెరిసే మెరుపులలో ఫొటోలు దిగుదాం ఫోటోలు దిగుదాం వాన పడుతోంది మనం ఏం చేద్దాం? … చదవడం కొనసాగించండి

Posted in చిట్టి-పాటలు, పాటలు, పిల్లలు | 1 వ్యాఖ్య

నా చిట్టి వర్ష

కలువల్ల కన్నుల్ల పాపాయి ఎవరు? నా చిట్టి వర్ష … తేనెల్ల పలుకుల్ల చిన్నారి ఎవరు ? నా చిన్ని వర్ష … మబ్బుల్ల బుగ్గల్ల అమ్మాయి ఎవరు? నా బుల్లి వర్ష … వెన్నెల్ల నవ్వుల్ల బుజ్జాయి ఎవరు? నా బుజ్జి వర్ష …

Posted in చిట్టి-పాటలు, నా రాతలు, పిల్లలు | 1 వ్యాఖ్య

“సహజ” పాటలు – నా పాట్లు

మా బంగారుతల్లి పేరు సహజ. మొన్నమొన్ననే పుట్టినట్లు నాకు అనిపిస్తూ ఉన్నా, తనకి అప్పుడే సంవత్సరం దాటి 4 నెలలు అయిపోయింది. సహజకి పాటలంటే చాలా ఇష్టం – బుద్ధిగా, శ్రధ్ధగా వింటుంది. నిద్రపోవడానికి, బువ్వ తినడానికి, స్నానం చెయ్యడానికి అన్నింటికీ పాటలే, పాటలు. నా పాటల్ని వినే ఒక ప్రాణి దొరికినందుకు నాకు, వినటానికి … చదవడం కొనసాగించండి

Posted in సహజ | Tagged , | వ్యాఖ్యానించండి