Category Archives: భక్తి

ప్రభు నువ్వే నువ్వే

అంతటా అన్నిటా ప్రభు నువ్వే నువ్వే అణువూ అణువువై నువ్వే విడివడి భిన్న రూపాలలో మళ్లీ కలిసి సుందర జగమే రంగస్థలిగా ॥ అంతటా ॥ సంద్రం నుంచి ఎగసే కెరటమై ఉరిమే మేఘమై కురిసే వర్షమై నదులూ చెరువులూ జలపాతాలుగా ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥ మట్టిలో రేణువై … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, భక్తి | 1 వ్యాఖ్య

భక్తి…

పదాలకు చిక్కని అద్భుతమైన భావనేమో భగవంతుడంటే. వర్ణింపశక్యం కానిదైనా, పంచుతూపోతే అలౌకికానందాన్ని పెంచే అందం ఆ “భావన”కి ఉండబట్టేనేమో చాలా మంది కళాకారులు తమ తమ కళలలో దానిని వ్యక్తం చేయటానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. సకల గుణ సమ్మిళితమైన ఆ ఆనందార్ణవంలో ఏ కొన్ని తరంగాలకో స్పందించి తమ శక్త్యానుసారం సన్నుతించగలిగారు. … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, భక్తి | 2 వ్యాఖ్యలు

అంతరావలోకనం

శ్వాస తెలిసే నిశ్శబ్దంలో వెలుగే దూరని చీకటి గదిలో లోలోపలి వెలుగుల కోసం వెతుకుతున్న ఈ నా మదిలో ఒక శాంతి కిరణం ఉదయించింది ఒక కాంతి పుంజం నర్తించింది ఆహా, ధన్యం నా ధ్యానం! ఇదంతా ఒకే ఒక్క క్షణం! మరుక్షణం అలోచనల అలలు, మళ్ళీ వెదుకులాటలో నేను!

Posted in నా రాతలు, భక్తి | 2 వ్యాఖ్యలు

గడ్డి పూలు

మేలిముసుగు చాటు నుండి నీ నవ్వు మబ్బుల్లో దోబూచులాడే నిండు పున్నమి జాబిలిని తలపింప చేస్తుంది. నిముషకాలంలో మబ్బులు కరిపోతాయి…మరి నీ ముసుగో? *** నీకిచ్చే మాట ఓ చిన్ని గడ్డిపూవులాంటిది. తోటకి వన్నె తేకుండానే, తన పనైపోయినట్లు సాయంకాలానికే రాలిపోతుంది. *** నువ్వు యాచకులకు భిక్ష వేయటానికి వస్తావని తెలిసి, దగ్గరగా చూసే అవకాశమని … చదవడం కొనసాగించండి

Posted in నా రాతలు, భక్తి | 1 వ్యాఖ్య

నివేదన

నీ కోసం తెచ్చిన పూల హారం వాడిపోయింది తోవ లోనే పళ్ళు దొర్లిపోయినాయి వీణ పగిలిపోయింది నిన్ను పిలిచే నా కంఠ స్వరం నా చెవులకే వినిపించడం మానింది ఎన్ని పగళ్ళు రాత్రులు నడిచినా ఎడతెగని అడవి దూరాన మసకలో కనపడీ కనపడని కోట బురుజులు ఎంతకీ చేరువ కాని సౌధదుర్గాలు.. నాకిక తోవ లేదు … చదవడం కొనసాగించండి

Posted in నచ్చిన కవితలు, భక్తి | 3 వ్యాఖ్యలు

శిధిలాలయం

శిధిలాలయమ్ములో శిలగానె మిగిలావ దేవా… ప్రేమ దీపము లేక శాంతి గంధము లేక అంతర్వివేచనల నిత్యార్చనలు లేక శిధిలమైనట్టి ఈ హృదయాలయమ్ములో శిలగానె మిగిలావ దేవా… నా వినతులాలించి నీ కరుణ సారించి ప్రాణమ్మునే మరల తేవా …

Posted in నా రాతలు, భక్తి | 5 వ్యాఖ్యలు