ఒక చిన్ని ఆశ…

మొన్నటి దాకా
మోడువారి ఉన్న చెట్లను
చిగురు చైతన్యం వరించింది
పచ్చదనం వెల్లివిరిసింది

నిన్నటి వరకు
ఎండలతో మండిన ఉద్యాన నగరిలో
తొలకరి జల్లు కురిసింది
పుడమి పులకరించింది

మరల మాటుకు నెట్టివేయబడిన
మనసులు రేపైనా స్పందించవా ?
మానవత్వం పరిమళించదా ?

This entry was posted in నా రాతలు. Bookmark the permalink.

1 Responses to ఒక చిన్ని ఆశ…

  1. chanti అంటున్నారు:

    chalabagundi ….
    frequent ga post chestuundandi ..

వ్యాఖ్యానించండి