గడ్డి పూలు

మేలిముసుగు చాటు నుండి నీ నవ్వు మబ్బుల్లో దోబూచులాడే నిండు పున్నమి జాబిలిని తలపింప చేస్తుంది. నిముషకాలంలో మబ్బులు కరిపోతాయి…మరి నీ ముసుగో?

***

నీకిచ్చే మాట ఓ చిన్ని గడ్డిపూవులాంటిది. తోటకి వన్నె తేకుండానే, తన పనైపోయినట్లు సాయంకాలానికే రాలిపోతుంది.

***

నువ్వు యాచకులకు భిక్ష వేయటానికి వస్తావని తెలిసి, దగ్గరగా చూసే అవకాశమని వారి చివరలో నేను కూడా కూర్చుండిపోయాను. నాక్కూడా బిచ్చమేసి, కళ్ళల్లోకి ఒక్కసారి చూసి ముందుకెళ్ళిపోయావు. ఇప్పటికే నువ్విచ్చిన భాగ్యరాశిని ఆ దీనులకి నీ వెనుకే వచ్చి పంచిపెట్టే బుధ్ధి ఎందుకు కలగలేదో, నా ఖర్మం కాకపోతే.

This entry was posted in నా రాతలు, భక్తి. Bookmark the permalink.

1 Responses to గడ్డి పూలు

  1. chavakiran అంటున్నారు:

    టైటిల్ చూసి దారంట పోతుంటె దారమల్లె సాగి ఉండు గుర్తు వచ్చింది.

    ఇదే పేరుతో తొలినాటి తెలుగు బ్లాగు ఒకటి ఉండేది.

వ్యాఖ్యానించండి