నా నానీలు

చెంపలు జారినవి
రెండు చుక్కలే.
మనసు లోపల
ఎన్ని ముక్కలో!

~~~

బరువుల్ని
తల’లో’కెత్తుకుంటే,
చాలా రుసుములు
చెల్లించాల్సొస్తుంది.

~~~

నాకంతా నువ్వే
అన్నాను…
నీ కళ్ళలో
నిండుగా నేను…

~~~

అనుభవం
దారి చూపిస్తే చాలు.
వేలు పట్టుకుని
నడిపించక్కర్లేదు!

~~~

పొంగినా, పొరలినా
జారినా, జాలువారినా
మారేది రూపమే!
స్వరూపం కాదు.

~~~

గుండె గది
కాస్త ఖాళీ చెయ్యవూ?
షోకేస్ లోనుంచి
వచ్చేస్తా వెనక్కి…

~~~

లోపలంతా వెతికాను
లేనే లేదు!
కొని తెచ్చుకోబోతున్నా
అందాన్ని…

~~~

ఇల్లు ఇరుకురా
అన్నాడు మొహమాటంగా..
ఇల్లాలు కాదుగా?
అన్నాను నవ్వుతూ.

This entry was posted in నచ్చిన కవితలు, నా రాతలు. Bookmark the permalink.

2 Responses to నా నానీలు

  1. మానసవీణ అంటున్నారు:

    వెంకటరావు గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ.

వ్యాఖ్యానించండి